యాచకులు కనపడితే..మనకు తోచినంత సాయం చేస్తాం..కానీ ఆ సంస్థ వారికి దానం చేయకండి అంటోంది. అది వారి మంచికే..దానం చేయకండి..వారి నైపుణ్యాలను గుర్తించి వారిపై పెట్టుబడి పెట్టండి’’ అంటోంది.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ‘కామన్‌మ్యాన్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ. ఎవరూ పుట్టుకతోనే యాచకులు కారని, వారిని సరైన మార్గంలో నడిపిస్తే వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని చెబుతోంది. ఇలాంటి మాటలు ఎవరైనా చెప్తారు అనుకుంటున్నారేమో..ఈ సంస్థ చెప్పడమే కాదు..చేసి చూపిస్తుంది. యాచకులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి కల్పిస్తూ వారిని వ్యాపారులుగా మారుస్తోంది కూడా. ఓ నివేదిక ప్రకారం భారతీయులు ఏటా రూ.34వేల కోట్లు యాచకులకు దానంగా ఇస్తున్నారట.
ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ‘బెగ్గర్ కార్పొరేషన్’కు ఆదరణ లభిస్తుండటంతో దానిని ఆదాయ వనరున్న కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ క్రమంలో రూ. 2.5కోట్ల పెట్టుబడులు సేకరించేందుకు మిశ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం తమకు అనుమతిస్తే.. యాచకులను గుర్తించి.. పిల్లల్ని, వృద్ధుల్ని పునరావాస కేంద్రాలకు పంపించి, 18-45ఏళ్ల వయసున్న వారికి మూడు నెలలు శిక్షణ ఇచ్చి, రుణాలు ఇప్పించి వ్యాపారం ప్రారంభించేలా చేస్తామని ‘కామన్‌మ్యాన్ ట్రస్ట్’ నిర్వహకులు అంటున్నారు.