కళ్లద్దాలు పెట్టుకునే వారు కామన్ గా చేసే తప్పులు..ఇవి అస్సలు చేయకుడదట..!

-

ఈరోజుల్లో స్పెట్స్ వాడకం ఎక్కువేపోయింది. చిన్నిచిన్న పిల్లలకే సైట్ వచ్చి స్పెట్స్ పెడుతున్నారు. స్టైల్ కోసం మరికొందరు, సిస్టమ్ ఎక్కువ చూస్తున్నామని కొందరు ఇలా చాలామంది స్పెట్స్ పెట్టుకుంటారు. అయితే కళ్లజోడు పెట్టుకునే వారికి కొన్ని అదనపు బాధ్యతలు ఉంటాయి. ఎక్కడికి వెళ్లినా వారు తమతో పాటు కళ్ళ జోడులను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది.

అలాగే.. వాటిని పెట్టుకునే ముందు మెత్తని క్లాత్ తో శుభ్రం చేసుకోవాలి. అంతే కాదు.. దానికోసం ప్రత్యేకం గా క్లాత్ ని ఉంచుకోవాలి. చాలా మంది చేసే పొరపాటు తమ డ్రెస్ కి లేదా దుపట్టాకి.. అబ్బాయిలయితే షర్ట్ కి తుడిచేసి పెట్టుకుంటారు. ఇలా చేయడం వలన వాటిపై ఉండే కంటికి కనిపించని దుమ్ము ధూళి గ్లాసెస్ పైకి చేరే అవకాశం ఉంటుంది.

అలా.. మనకు తెలియకుండానే ఈ దుమ్ము ధూళి కంట్లోకి చేరతాయట. పైకి మాత్రం గ్లాస్ క్లీన్ అయినట్లే కనిపిస్తుంది కానీ లోపల ఇంత జరుగుతుంది.. మరికొందరేమో జాగ్రత్తపరులు ఉంటారు. ఇక ఆ జోడు అరిగిపోయిద్దేమో అనేట్లు చాలా సేపు తుడుస్తూ ఉంటారు. ఈ అతిజాగ్రత్త కూడా అవసరం లేదు. కనీసం ఇరవై సెకెన్ల పాటు తుడిస్తే సరిపోతుంది. అలాగే.. కళ్ళద్దాలను ఉపయోగించే ముందు చేతులని శుభ్రపరుచుకోవాలి. అప్పుడు చేతులపై సూక్ష్మ కణాలు అద్దాలకు ఎప్పుడైనా అద్దాలకు దుమ్ము పట్టి వదలకపోతే.. తడిగుడ్డతో తుడవడం కాకుండా.. గోరువెచ్చని నీటిని అద్దాలపై పోయాలి.

ఆ తరువాత పొడిగా ఉన్న మెత్తని మైక్రో ఫైబర్ క్లాత్ తో తుడవాలి. కేవలం అద్దాలపైనే ఫోకస్ చేయడం కాకుండా.. ఫ్రేమ్ పై కూడా శ్రద్ధ వహించాలి. లేదంటే అవి తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కొందరైతే.. కళ్లద్దాలు శుభ్రం చేసేందుకు నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగిస్తూ ఉంటారు.

ఇది అస్సలు చేయకూడదు. ఎందుకంటే.. నెయిల్ పోలిష్ రిమూవర్ లో అసిటోన్ ఉంటుంది. ఇది లెన్స్ లను పాడుచేస్తుంది. దీనిపెట్టి క్లీన్ చేసిన అద్దాలను ఉపయోగించడం వలన కళ్ళుకు ఎక్కువ అలసట అనిపిస్తుంది. ఉపయోగం ఏమి ఉండదు. చాలా మంది కళ్ళద్దాలను జేబులోను, టేబుల్స్ పైన ఎక్కడపడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. వాటికోసం ప్రత్యేకం గా కేటాయించిన బాక్స్ లలో మాత్రమే వాటిని ఉంచాలి. అలా చేయకపోతే వాటిపై కనిపించని గీతలు పడతాయి. ఇంకా స్పెట్స్ ని పట్టుకునేప్పుడు కూడా ఫ్రేమ్ ని పట్టుకోవాలి..చాలామంది అద్దాలను టచ్ చేస్తారు అలా చేస్తే వాటిపై అనవసరమై దుమ్ము పడుతుంది. ఇలా కళ్ళద్దాల పట్ల శ్రద్ధ వహిస్తేనే.. మన కళ్ళు పదిలంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version