మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ !

-

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఆక్సిజన్‌ బ్యాంకులను స్థాపించి.. మెగాస్టార్‌ చిరంజీవి… రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి విధితమే. అయితే.. ఈ సేవల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్రతి నిధులు పాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్‌ సేవల్లో పాల్గొన్న ప్రతి నిధులను పిలిచి మెగాస్టార్‌ ప్రశంసించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌ లోని చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ వేదికగా జరిగింది.

అయితే.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరు చేతికి… ఓ వైద్యులు వేసిన పట్టీ కనిపించింది. అయితే… దీనిపై ఆయన ఫ్యాన్‌ అడిగారు. దీంతో వారికి సమాధానం ఇచ్చారు చిరు. తన అరచేతికి చిన్న సర్జరీ అయిందని.. కుడిచేతితో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరి ఏర్పడుతున్నట్లు అనిపించడంతో డాక్టర్‌ ను సంప్రదించానని చెప్పారు.

కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్‌ నర్వ్‌ అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని దీనిని కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ అంటారని వైద్యులు చెప్పినట్లు చిరు క్లారిటీ ఇచ్చారు. దీంతో అపోలో ఆస్పత్రిలో ఇటీవలే సర్జరీ చేయించుకున్నానని..ఈ సర్జరీని 45 నిమిషాల పాటు చేశారన్నారు చిరు. ప్రస్తుతం తాను షూటింగ్‌ లకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. మరో 15 రోజులు రెస్ట్‌ తీసుకోవాలని వైద్యులు చెప్పారన్నారు చిరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version