ఒలంపిక్స్‌లో ప‌త‌క విజేత‌ల‌కు ఫ్రీగా విమాన స‌ర్వీసులు ప్ర‌క‌టించిన కంపెనీలు!

-

ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా ఒలంపిక్స్ గురించే మాట్లాడుకుంటోంది. ఈ ఆట‌ల్లో ఏ దేశం ఎన్ని ప‌థ‌కాలు కొడుతుందో అని అంతా లెక్క‌లేసుకుంటున్నారు. ఇక మ‌న దేశం త‌ర‌ఫున కూడా ఎంతో మంది బ‌రిలోకి దిగినా కూడా కొంద‌రు మాత్ర‌మే ప‌త‌కాల‌ను కొట్టుకొచ్చారు. ఇక వీరికి ఇప్పుడు దేశ‌మంతా స‌లాం కొడుతోంది. వీరికి ఇప్ప‌టికే ఆయా ప్ర‌భుత్వాలు భారీగా న‌జ‌రానా కూడా ప్ర‌క‌టించాయి. కాగా ఇప్పుడు కొంద‌రు కంపెనీ య‌జ‌మానులు కూడా ఆఫ‌ర్లు ఇస్తున్నారు.

ఇక టోక్యో ఒలంపిక్స్ లో ఇండియాకు పతకాల‌ను తెచ్చిన విజేతలకు, పురుషుల హాకీ టీమ్ కు ఫ్రీగా విమాన ప్రయాణం క‌ల్పించ‌నున్న‌ట్టు రెండు ఎయిర్ లైన్స్ కంపెనీలు అనౌన్స్ చేశాయి. గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ కంపెనీ వారు ప‌త‌కాల‌ను తెచ్చిన విజేత‌ల‌కు 5 ఏళ్ళ పాటు వీరికి ఫ్రీగా ఫ్లైట్ టికెట్స్ ఇస్తామని ప్రకటించింది.

కాగా ఇండియాలో 13 నగరాలను కలిపే స్టార్ ఎయిర్ కంపెనీ ఏకంగా వీరికి జీవిత కాలం కూడా ఫ్రీగా విమానాల్లో ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తామ‌ని వివ‌రించింది. ఇక ఏకైక గోల్డ్ మెడల్ తెచ్చిన నీరజ్ చోప్రాకు మాత్రం ఓ ఏడాది పాటు అపరిమిత ఫ్రీ ట్రావెలింగ్ సౌక‌ర్యాన్ని కల్పిస్తున్నట్టు ఇండిగో ఎయిర్ లైన్స్ రీసెంట్‌గా చెప్పింది. మీరాబాయి చాను, పీ.వి.సింధు, లవ్ లీనా అలాగే పురుషుల హాకీ టీమ్ తో పాటు రవి కుమార్ దహియా, బజరంగ్ పునియా, నీరజ్ చోప్రాలు ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌త‌కాల పంట పండించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version