నువ్వా నేనా.. పోటాపోటీగా తెలుగు రాష్ట్రాలు..!

-

కరోనా వైరస్‌ రోజు రోజుకి వ్యాప్తి చెందుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. చైనా నుండి మొదలైన ఈ మహమ్మారి ప్రపంచాన్ని గడగడ వణికిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి 9,710,205 మంది ఈ వైరస్‌ బారిన పడగా 491,783 మంది మరణించారు. కోలుకున్నవారి సంఖ్య 5,279,579 గా ఉంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో ఉంది. ఐదు లక్షల కేసుల దిశగా దూసుకుపోతుంది. అధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనాను కట్టడి చేయలేకపోతున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల దగ్గరికొస్తే పరిస్థితిలో పెద్దగా తేడా ఏం లేదు. మొదట్లో కొంచెం బాగా ఉన్నా ఇప్పుడు మాత్రం అదులో ఉన్నట్లు కనిపించడం లేదు.

తెలంగాణలో ఇప్పటి వరకు 11,364 కేసులు నమోదు కాగా 4,361 కోలుకున్నారు. 230 మంది మరణించగా 6,446 మంది చికిత్స పొదుతున్నారు. ఆంధ్రప్రేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు పదివేలు దాటి 10,884కి చేరుకోగా 136 మంది మరణించారు. ఇంకా 5,760 మంది చికిత్స అంది
స్తున్న ఏపీలో 4,988 కోలుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మరణాల శాతం తక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశం.

తెలంగాణలో ఓ ద‌శ‌లో క‌రోనా నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చిన‌ట్లే క‌నిపించినా ఇప్పుడు అక‌స్మాత్తుగా కేసుల సంఖ్య నిత్యం భారీగా న‌మోద‌వుతుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. అభివృద్ధిలోనే కాదు ఏ విషయంలోనైనా మన తెలుగు రాష్ట్రలు పోటీ పడుతున్నట్లుగా కరోనా వ్యాప్తిలో కూడా అదే కొనసాగుతుంది. కరోనా వ్యాప్తిని అరికట్టడం ప్రజల చేతుల్లోనే ఉంది ప్రభుత్వాలు, అధికారులు చేసేదేమి లేదు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు పక్కాగా వాడటం తప్పనిసరి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కరోనా కోసమే కాదు అన్నింటికీ ముఖ్యమే. కరోనా వైరస్‌ నిజానికి అంత పెద్ద ప్రమాదకారి కాదు కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారిగా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version