ఐఏఎస్ అధికారులు దేశసేవ కోసం అంకింత అవుతుంటారు. కేంద్రం, రాష్ట్రాల అభివృద్ధిలో వారి పాత్ర కీలకం. ప్రభుత్వ పాలనలో వారొక అంతర్భాగం. బ్యూరో క్రాట్లు లేకపోతే ప్రభుత్వాలు సమర్థవంతంగా ముందుకు సాగలేవు. అలాంటిది ఇటీవలి కాలంలో కొందరు ఐఏఎస్‌ల మీద సైతం దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల కొడంగల్‌లోని లగచర్లలో ఐఏఎస్ అధికారి మీద గ్రామస్తుల ముసుగులో కొందరు ఐఏఎస్ మీద దాడికి యత్నించిన విషయం తెలిసిందే.
తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి (75) ఆర్ మీనా మీద బస్సు కండక్టర్ దాడికి పాల్పడ్డాడు. విశ్రాంత కలెక్టర్ దిగాల్సిన స్టాప్ రాలేదని అనుకుని సీట్లో కూర్చున్నాడు.బస్సు డ్రైవర్ కూడా చెప్పకపోవడంతో ముందు స్టాప్‌లో దిగాల్సి వచ్చింది.దీంతో రూ.10 కోసం కండక్టర్ రిటైర్ట్ ఐఏఎస్ మీద దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రూ.10 కోసం విశ్రాంత ఐఏఎస్‌పై కండక్టర్ దాడి..
రాజస్థాన్‌లోని జైపుర్‌లో రిటైర్డ్ IAS 75 ఏళ్ల ఆర్ మీనా దిగాల్సిన స్టాప్ రాలేదు అనుకొని కూర్చున్నాడు.. బస్సు డ్రైవర్ కూడా చెప్పకపోవడంతో ముందు స్టాప్‌లో దిగాల్సి వచ్చింది. దీంతో 10 రూపాయల కోసం కండక్టర్ IAS అధికారిపై తీవ్రంగా దాడి… pic.twitter.com/EbvJaj2Wyv
— ChotaNews App (@ChotaNewsApp) January 13, 2025