Skin Care: కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడే ఆహారాలు ఇవే

-

కొల్లాజెన్.. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ఈ ప్రోటీన్ తప్పకుండా అవసరం. అందుకే మనం తీసుకునే ఆహారంలో ఈ ప్రోటీన్ ఉండేట్టు చూసుకోవాలి. ప్రస్తుతం కొల్లాజెన్ ప్రోటీన్ ని ఉత్పత్తి చేసే ఆహారాలను తెలుసుకుందాం.

టమాట:

దీనిలో లైకోపీన్ ఉంటుంది. ఇది సూర్యకిరణాల వల్ల చర్మం పాడవకుండా కాపాడుతుంది. అంతేకాదు.. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మృదుత్వాన్ని పెంచుతాయి.

చేపలు:

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన చేపలు తినడం వల్ల కొల్లాజెన్ పాడవకుండా ఉంటుంది. సాల్మన్, మాకెరల్ వంటి చేపల్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

గుడ్డు తెల్లసొన:

గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. రోజువారి ఆహారంలో గుడ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. గుడ్డులోని తెల్లసొన చర్మాన్ని సంరక్షించే కొల్లాజెన్ ని పాడవకుండా కాపాడుతుంది.

ఆకుకూరలు:

ఆకుపచ్చగా ఉండే ఆకుకూరల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మం తేమగా ఉండాలంటే, మృదువుగా ఉండాలంటే ఆకుకూరలను డైలీ డైట్ లో భాగం చేసుకోవాలి. ఇవి కొల్లాజెన్ ని పాడవకుండా చూస్తాయి.

గింజలు:

బాదం, వాల్ నట్స్ వంటి గింజల్లో కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా మారతాయి.

విటమిన్ సి:

నారింజ, నిమ్మ, ఉసిరి మొదలగు పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ సి కారణంగా కొల్లాజెన్ సురక్షితంగా ఉంటుంది.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news