గురుకుల ఫలితాల్లో గందరగోళం.. ర్యాంకర్స్‌కు నో సీట్స్

-

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు గందరగోళంగా మారాయి.పరీక్షకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఒక చిన్న పొరపాటు ఉండడం వల్ల ఒక విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చినా సీటు రాలేదని తెలిసింది. మరొక 53 మంది విద్యార్థులకు కూడా చిన్న తప్పు వల్ల సీట్లు కేటాయించ లేదని సమాచారం.

అధికారులకు,బీసీ కమిషన్‌కు ఈ విషయంపై లేఖ రాసినా విద్యార్థులకు నిరాశే మిగిలింది. గురుకులాల్లో 51,968 సీట్ల భర్తీ కోసం ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించగా, మార్చి 29న 1,944 మంది ప్రత్యేక వర్గాల విద్యార్థుల జాబితాను, ఏప్రిల్ 4వ తేదీన 38,278 మంది విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. గతంలో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే విద్యార్థి ర్యాంకు, సీటు అలాటైన వివరాలు వచ్చేవి.కానీ, ఇప్పుడు మెరిట్ జాబితా అని, ఫస్ట్ రౌండ్ సీటు జాబితా అని కేవలం పీడీఎఫ్ ఫైల్స్ మాత్రమే అందుబాటులో ఉంచినట్లు తెలిసింది.మొదటి జాబితాలో ఒక చోట సీటు వస్తే, రెండో జాబితాలో ఇంకో చోట సీటు వచ్చినట్టు చూపిస్తున్నదని.. అధికారులు కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో తమ పిల్లల సీటు వివరాలు తెలియక తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news