యూపీలో దారుణం.. పిడుగుపాటుకు గురైన ఐదుగురు విద్యార్థులు

-

యూపీలో దారుణం చోటుచేసుకుంది. అక్కడ భారీగా వర్షాలు కురుస్తుండటంతో పిడుగు పాట్లకు జనాలు గురవుతున్నారు. తాజాగా  ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్ తీర్థంకర మహావీర్ విశ్వవిద్యాలయంలో పిడుగుపాటుకు ఐదుగురు విద్యార్థులు గురయ్యారు.

ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అంతకుముందు వర్షం పడుతుంటే ఐదుగురు విద్యార్థులు చెట్టు కింద నిల్చున్నారు. ఈ క్రమంలోనే చెట్టు మీద పిడుగు పడటంతో వారంతా ఒక్కసారిగా కుప్పకూలారు. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news