హనుమాన్ జయంతి సందర్భంగా ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టు ఓనర్ ప్రీతి జింటా శనివారం సికింద్రాబాద్ పరిధిలోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి వారి ఆలయానికి విచ్చేశారు.
అనంతరం భక్తులతో కలిసి క్యూ లైన్లో వెళ్లిన ఆమె తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయంలో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ప్రీతి జింటా ప్రత్యేక పూజలు జరిపారు.కాగా, ఇవాళ సాయంత్రం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్‌తో తలపడనున్న పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు అద్భుతంగా రాణిస్తుండగా.. సన్ రైజర్స్ జట్టు మాత్రం పేలవంగా ఆడుతోంది. నేటి మ్యాచులో ఓడిపోతే హైదరాబాద్ జట్టు నేరుగా ఇంటికి వెళ్లనుంది.