సిపిఐకు కొత్తగూడెం సీటును ఇస్తున్నాం: రేవంత్ రెడ్డి

-

మరో మూడు వారాలలో తెలంగాణాలో ఎన్నికలు జరగనుండడంతో సీట్లు కేటాయింపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అన్ని పార్టీలకు పూర్తి కావస్తోంది. ఇక గెలిచే అవకాశాలు అన్ని పార్టీలకంటే ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ సీట్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా రేవంత్ రెడ్డి సిపిఐ నేతలతో భేటీ అయ్యి చర్చించిన అనంతరం మీడియా ముందుకు వచ్చి కీలక విషయాన్ని వెల్లడించారు. ఈయన మాట్లాడుతూ సిపిఐ తో వచ్చే ఎన్నికలకు పొత్తు కుదిరింది, సీపీఐకి కొత్తగూడెం సీటును ఇస్తున్నామంటూ ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇక ఎన్నికల తర్వాత సీపీఐకి మరో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. సిపిఐ తరపున కొత్తగూడెంలో పోటీ చేసే అభ్యర్థిని గెలిపించుకోవడానికి కాంగ్రెస్ గట్టిగా కృషి చేస్తుందని మాటిచ్చారు రేవంత్ రెడ్డి.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే, భవిష్యత్తు లేదనే చెప్పుకోవాలి అందుకే ప్రతి ఒక్క అవకాశాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ ముందుకు తీసుకువెళుతున్నారు రేవంత్ రెడ్డి. ఓవైపు అధికార BRS పార్టీ ఈసారి ఎన్నికల్లో 100 సీట్లను గెలుచుకుని మళ్ళీ అధికారాన్ని ఏర్పాటు చేస్తామంటూ ధీమాతో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version