Congress: తెలంగాణ కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్’ ప్రారంభం

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలే లక్ష్యంగా ‘ నవకల్పన చింతన్ శిబిర్’ సమావేశాలు కీసర వేదికగా నిర్వహిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేయనుంది. రాష్ట్ర కీలక నేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. రాజస్తాన్ లో జరిగిన చింతన్ శిబిర్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాల మేరకే రాష్ట్రాల్లో చింతన్ శిబిర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పొత్తు ఉండని స్పష్టం చేశారు.

ఆరు కమిటీలను ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు సమాయత్తం కానుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలను, ఆత్మగౌరవాన్ని కాపాడేలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సీఎల్పీ నేత మల్లు బట్టివిక్రమార్క అన్నారు. రాజకీయ, ఆర్థిక, వ్యవస్థాగత, వ్యవసాయ, సామాజిక న్యాయం, యువత ఇలా ఆరు కమిటీలను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చలు జరుగుతాయని బట్టి వెల్లడించారు. రైతుల సమస్యలు, యువతకు ఉద్యోగాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా అన్నింటిపై చర్చించనున్నట్లు బట్టి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version