కాంగ్రెస్ లో కలకలం.. ఈ రోజు కాంగ్రెస్ సీనియర్లు జీ 23 సమావేశం

-

ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఘోరంగా పరాజయం పాలైంది. ఈ ఓటమిపై కాంగ్రెస్ లో సీనియర్లు తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. పార్టీని పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలని డిమాండ్  చేస్తున్నారు. గాంధీ కుటుంబం నుంచి నాయకత్వ పగ్గాలు ఇతరులకు ఇవ్వాలంటూ… డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ రెబెల్స్ తో కూడిన జీ 23 గ్రూప్ మరోసారి ఈరోజు ఢిల్లీలో సమావేశం కానుంది. 

సీనియర్ కాంగ్రెస్ నాయకులు గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్, శశి ధరూర్, ఆనంద్ శర్మ వంటి వారు ఈ జీ 23 గ్రూప్ లో ఉన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఓ సారి సమావేశమైన కాంగ్రెస్ సీనియర్లు.. కాంగ్రెస్ ఘోర పరాజయం గురించి చర్చించుకున్నారు. ఫలితాలను చూసి కలత చెందా అంటూ గులాంనబీ ఆజాద్ తన బాధను వ్యక్తపరిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఉన్నాయి. ఓ వర్గం పార్టీలో ప్రక్షాళన చేయాలని గాంధీ కుటుంబాన్ని తప్పించాలని కోరుతుంటే.. మరో వర్గం గాంధీ కుటుంబానికి మద్దతు ఇస్తోంది. ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనిపై కాంగ్రెస్ సీనియర్లు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. తాాజాగా జరుగుతున్న ఈసమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version