ముస్లిం మైనార్టీలకు కాంగెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని నల్లగొండ పట్టణంలో రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు చివరి అంకమైన ‘ఈద్-ఉల్-ఫితర్’ రోజున ముస్లిం సోదర, సోదరీమణులందరితో కలిసి రంజాన్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగావారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి, ప్రజలకు అంతా మంచి జరగాలని రంజాన్ రోజున ముస్లిం సోదరులతో కలిసి అల్లాను ప్రార్థించినట్లు వివరించారు. ఇక ముస్లిం మైనారిటీ వర్గానికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.