HCUలో జేసీబీల చక్కర్లు.. వర్సిటీని చుట్టుముట్టిన పోలీసులు

-

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు యూనివర్సిటీలో లోపల నిన్న అర్ధరాత్రి నుంచి జేసీబీలు చక్కర్లు కొడుతున్నాయి. చెట్లన్నింటినీ తొలగిస్తూ మైదానాన్ని చదును చేస్తున్నాయి. 400 ఎకరాల వర్సిటీ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగగా పోలీసులు వారిని నిలువరిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ లోనికి వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగుల గుర్తింపు కార్డులను పరిశీలించి మరీ లోనికి పంపుతున్నారు. కాగా, యూనివర్సిటీ భూములను విక్రయించొద్దని, అందులోని చెట్లను నరకొద్దని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలోకి జేసీబీలు రావడంతో విద్యార్థి సంఘాల సైతం సీరియస్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news