త్వరలోనే కాంగ్రెస్ సర్కార్ చేసినటువంటి బడా స్కామ్ బయటపెడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాలే కాదు.. దాని వెనుక వేల ఎకరాల వ్యవహారం ఉందని.. త్వరలో భారీ స్కామ్ బయటపెడతానన్నారు.ఇందులో ఓ బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు.
రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీలో ఉందని, ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే..మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి సీఎంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని ఆరోపించారు.మంత్రి పొంగులేటి వదులుదామనుకున్న బాంబులు తుస్సుమన్నయ్.. అందుకే సైలెంట్ అయిపోయాడని విమర్శించారు.