ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ చదువుతుండగా.. ఆ స్కూల్‌లో నేటి ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పవన్ తనయుడు ‘మార్క్ శంకర్’ కాళ్ళు, చేతులకు గాయాలైనట్లు సమాచారం. దట్టమైన పొగ కారణంగా లంగ్స్ లోకి పొగ వెళ్లగా తీవ్ర ఇబ్బందులకు గురవ్వగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.
విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లనున్నట్లు సమాచారం. విషయం తెలిసి ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. ‘సింగపూర్‌లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది.సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను’అని రాసుకొచ్చారు.