డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ‘మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

ఇక ఈ విషయం తెలిసి ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. ‘సింగపూర్‌లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది.సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను’అని రాసుకొచ్చారు.