కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అనుచరుడి భూ కబ్జా బాగోతం..

-

కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అనుచరుడి భూ కబ్జా బాగోతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.ఏకంగా ప్రభుత్వ భూమినే కబ్జా చేసి, అనుమతులు లేకుండానే 18 షెట్టర్లను షబ్బీర్ అలీ అనుచరుడు జీడిపల్లి నర్సింహా రెడ్డి నిర్మించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రభుత్వ భూములపై వైస్ ఎంపీపీ జీడిపల్లి నర్సింహా రెడ్డి కన్నేయడంతో పాటు తన కూతురు దీపిక పేరు మీద అక్రమంగా షెట్టర్లను నిర్మించాడు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. ఈ షెట్టర్లలో MDO, MPP ఇంకా కొంతమంది అధికారులకు షేర్లు ఉన్నాయని సమాచారం.ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కబ్జాలు చేస్తున్న జీడిపల్లి నర్సింహా రెడ్డికి అధికారులు అండగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news