BREAKING : కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ ఇంటిపై దుండగుల దాడి, కారు ధ్వంసం

-

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటి పై రాత్రి దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఆయన ఇంటి ముందు నిలిపిన కారు అద్దాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు… అర్ధరాత్రి రచ్చ చేశారు. అయితే.. ఈ సంఘటన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు వి హనుమంతరావు. దీంతో కేసు బుక్‌ చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

ఇక ఈ సంఘటన వి హెచ్ మాట్లాడుతూ…. బడుగు, బలహీన వర్గాల సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్య పరిష్కారానికి నేను ముందుంటానని పేర్కొన్నారు. ఈ చర్య ఎవరు చేశారు అనే విషయాన్ని కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు..

మాజీ పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన నాకు కనీస రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్‌ ప్రభుత్వానికి లేదా…అని నిలదీశారు. గతంలో బెదిరింపు కాల్స్ వచ్చిన సందర్భంలో తెలంగాణ డిజిపి గారికి విన్నవించినా కూడా పరిష్కారం చూపలేదు… ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version