యాదాద్రి ఆలయంలో సీఎం రేవంత్ ఆదివారం స్వర్ణ విమాన గోపురం స్వర్ణాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డితో వచ్చిన పలువురు కాంగ్రెస్ నేతలు ఆలయంలోకి చెప్పులు వేసుకొని వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది.
రేవంత్ రెడ్డి ఆలయంలోకి వెళ్తున్న క్రమంలో చెప్పులు వేసుకుని ప్రాంగణంలో సంచరించడం ఏమిటని పలువురు భక్తులు, ఆలయ నిర్వాహకులు సైతం మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయడం ఏంటని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.