తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాగ్ సంచలన రిపోర్టు.. 118.94% పెరిగిన అప్పు

-

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాగ్ సంచలన రిపోర్టు వెలువరించింది.సీఎం రేవంత్ అసమర్థ పాలనలో తెలంగాణకు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని నివేదిక బట్టబయలు చేసింది. గతేడాదితో పోలిస్తే రూ.13వేల కోట్లు తగ్గిన ఆర్థిక సంపద తగ్గింది. అంచనాలకు మించి రాష్ట్ర ప్రభుత్వం 118.94% అప్పు చేసింది. ప్రభుత్వ విధానాలతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడం, 10 నెలల్లో రిజిస్ట్రేషన్ల మీద వచ్చిన ఆదాయం 31% మాత్రమే అని తెలిసింది.

బడ్జెట్లో రెవెన్యూ రాబడులు రూ.2,21,242 కోట్లు అంచనా వేయగా, కేవలం 55.96 శాతం అంటే రూ.1,23,815 కోట్లు మాత్రమే రాబడులు వచ్చాయి. 2023-24 ఏడాదిలో రెవెన్యూ రాబడులు రూ.1,36,859.69 కోట్లు ఉండగా, 2024-25లో రూ.1,23,815.60 కోట్లకు అంటే 9.53% పడిపోయింది. 2023-24 సంవత్సరంలో స్టాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.11,698.55 కోట్లు ఉండగా, 2024-25 సంవత్సరానికి రూ.5,821.88 కోట్లకు పడిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక విధానాల కారణంగా అప్పులు పేరుకుపోతున్నాయని విశ్లేషకులు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news