ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ విశ్వ‌స‌నీయ‌త కోల్పోయింది : మ‌మ‌తా బెన‌ర్జీ

-

దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ పార్టీ విశ్వ‌స‌నీయ‌త కోల్పోయింద‌ని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫ‌లితాల‌పై తాజా గా మ‌మ‌తా బెనర్జీ స్పందించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బ‌ల‌హీనప‌డుతుంద‌ని అభిప్రాయ ప‌డ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీపై ఆధారప‌డేలమంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అలాగే ఉత్త‌ర ప్ర‌దేశ్, గోవా, మ‌ణిపూర్, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై కూడా మమ‌తా బెన‌ర్జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Mamata

ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీది ప్ర‌జా గెలుపు కాద‌ని విమ‌ర్శించారు. ఈవీఎం మిషన్ ల విజ‌యం అని ఆరోపించారు. ఈవీఎం ల‌ను ట్యాప్ చేయ‌డం వ‌ల్లే బీజేపీ విజ‌యం సాధించింద‌ని ఆరోపించారు. బీజేపీకి ద‌క్కింది.. ప్ర‌జా తీర్పు కాద‌ని.. ఈవీఎం తీర్పు అని విమ‌ర్శించారు. కాగ బీజేపీ ఓడించ‌డానికి అన్ని పార్టీలు క‌లిసి ముందుకు రావాల‌ని మ‌మ‌తా బెనర్జీ అన్నారు. 2024 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ప‌ని చేస్తామ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version