కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతవ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న 46 ఏళ్ల రాజీవ్ గత కొన్ని రోజులుగా కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో వెంటిలేటర్ సహాయంతో ఆయనకు చికిత్స అందించారు. గత నెల 22 న ఆయన కరోనా బారిన పడ్డారు.
తరువాత సతవ్ కొత్త వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడ్డారు. ఆ తర్వాత పరిస్థితి క్రమంగా విషమంగా మారింది అని వైద్యులు వెల్లడించారు.రాజీవ్ సాతావ్ మరణం పట్ల కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా సంతాపం ప్రకటించారు. యూత్ కాంగ్రెస్ లో తనతో కలిసి వచ్చి మంచి స్నేహితుడ్ని కోల్పోయాను అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజాదరణ ఉన్న నాయకుడ్ని కాంగ్రెస్ కోల్పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసి వేణుగోపాల్ ట్వీట్ చేసారు.