రఘురామ కృష్ణం రాజు ప్రాణాలకు ముప్పు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

ఎంపీ రఘరామ ప్రాణాలకు ముప్పు ఉందని తెలంగాణా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేసారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు. లోక్ సభ స్పీకర్ అనుమతి లేకుండా అరెస్టు చేయటానికి అనుమతి లేదు అని ఆయన స్పష్టం చేసారు. ఎంపీ కాళ్ల గాయాలు చూస్తుంటే పోలీసులు చాలా దుర్మార్గంగా కొట్టారని స్పష్టమవుతోంది అని అన్నారు.

ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? నియంతృత్వం కొనసాగుతోంది అని ఆయన మండిపడ్డారు. కొందరి మెప్పు కోసం పోలీసులు ఎంపీపై అత్యంత క్రూరంగా వ్యవహరించారు అని అన్నారు. పాలకులు శాశ్వతం కాదని పోలీసులు గుర్తుంచుకోవాలి అని హితవు పలికారు. ఎంపీల హక్కుల కోసం పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఉందన్న విషయం మర్చిపోవద్దు అని దేశంలోని ఎంపీలు, ప్రజాస్వామ్య వాదులందరూ పార్టీలకతీతంగా దుర్మార్గాన్ని ఖండించాలి అని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version