వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమే – భట్టి

-

కొమురం భీం జిల్లా అసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ” హాత్ సే హాత్” జోడో పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా బూసిమెట్టలో ఆదివాసీల తో భట్టి విక్రమార్క మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవి మనది.. అడవిపై హక్కులు మనవి.. మనల్ని ఆపేది ఎవ్వరని అన్నారు. ఆదివాసీల హక్కులను కాపాడతానని వారికి హామీ ఇచ్చారు.

ఆదివాసీల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమేనన్నారు భట్టి విక్రమార్క. అప్పుడు మీకందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బూచి మెట్ట గ్రామం మహిళలు, ప్రజలు వారి సమస్యలను బట్టి విక్రమార్కకి మొరపెట్టుకున్నారు. “మమ్మల్ని అడవిలోకి పోనివ్వడం లేదు. కాయలు, పండ్లు, తేనే, కుంకుడు కాయలు కూడా తెచ్చుకొనివ్వడం లేదు.గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూమి పట్టాలు ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం కొత్త పట్టా పాస్ బుక్కులు ఇవ్వడం లేదు.

ధరణి ఆన్ లైన్ లో మా భూములు వివరాలు ఎక్కించడం లేదు. ధరణిలో పేరు లేకపోతే బతికి ఉన్నా చనిపోయినట్టే. బ్యాంక్ వాళ్లు లోన్లు కట్టాలని మమ్మల్ని వేధిస్తున్నారు. ఇండ్లు లేవు, తినడానికి కూడా రేషన్ బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. ఆ బియ్యం కూడా దొడ్డు బియ్యం మాత్రమే.. మీరే చూడండి.. ఈ బియ్యంతో అన్నం ఎలా తినాలి. మాకు కనీసం బాత్ రూమ్ లు కూడా ఇవ్వలేదు. మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 9 రకాల వస్తువులు ఇచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరెంట్ కూడా తీసేస్తున్నారు. మేము ఎలా బతకాలి. మమ్మల్ని అడవిలోకి పోనివ్వడం లేదు” అని మొరపెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version