తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందనే విషయం అందరికీ అర్థమవుతుంది. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారా లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. దాదాపు ఆయన పాదయాత్రకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ఆయన విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడానికి వీలులేదు అని కొంతమంది నేతలు స్పష్టంగా చెబుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కొంతమంది నియోజకవర్గాల ఇన్చార్జిలు ఆయనకు సహకరించే అవకాశాలు దాదాపు కనబడటం లేదు. అందుకే రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు అని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరుతున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత మంది నాయకులు తెలంగాణ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ని మార్చినా మార్పు రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. అందుకే ఇప్పుడు కొన్ని కీలక మార్పులకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.