టీ పీసీసీ చీఫ్ మార్పుకు బ్రేక్… రీజ‌న్ ఏంటంటే..?

-

కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న వరుస ఓటముల కారణంగా తన టీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసైడయినట్టు చాలా రోజుల బ‌ట్టీ వార్తలు వినిపిస్తున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తరువాత టీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడానికి ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి… ఇక తాను ఈ పదవిలో కొనసాగలేనని పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో కొత్త చీఫ్ ఎవ‌రు రాబోతున్నారా.. అన్న ఆస‌క్తి నెల‌కొంది. అయితే ఆయన మరోసారి టీపీసీసీ చీఫ్ హోదాలో పార్టీ సమావేశం ఏర్పాటు చేయడంతో… మరికొంతకాలం ఉత్తమ్ తెలంగాణ కాంగ్రెస్ బాస్‌గా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్ప‌ట్లో కొత్త టీ పీసీసీ చీఫ్ లేన‌ట్టే

దీంతో టీ పీసీసీ చీఫ్ మార్పు ఇప్ప‌ట్లో లేనట్టు తెలుస్తోంది. మ‌రి వాయిదాకు రీజ‌న్ ఏంటా అని చూస్తే.. ఇప్పటికిప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవడం వల్ల కొత్త సమస్యలు వస్తాయని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్… తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆయననే టీ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరినట్టు తెలుస్తోంది. అలాగే ఇప్పటికిప్పుడు పీసీసీ చీఫ్ మార్పు నిర్ణయం తీసుకుంటే.. కొత్తగా వచ్చే పీసీసీ అధ్యక్షుడు ఎన్నికలపై దృష్టి పెట్టడం కష్టమవుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా.. కొంత కాలం వ‌ర‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి లేనట్టే అనే టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version