కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలో జరిగిన ఫిరాయింపులపై దృష్టి సారించింది. కాంగ్రెస్‌లో గతంలో జరిగిన ఫిరాయింపులపై ఇప్పుడు ఫోకస్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి మారిన 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.
ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు భేటీ కానున్నారు. అనంతరం సీఎల్పీ నుంచి కాంగ్రెస్ నాయకుల బృందం మొయినాబాద్ పీఎస్‌కు వెళ్లి.. అక్కడ.. బీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయనున్నారు. బీఆర్ఎస్లో చేరి 12 మంది ఎమ్మెల్యేలు పొందిన ఆర్థిక, రాజకీయ లబ్ధిపై ఫిర్యాదులో పేర్కొననున్నారు. ఓవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు సిట్, సీబీఐ, హైకోర్టులలో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.