కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామన్య ప్రజలపై ధరల భారం మోపుతున్నాయని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల తో పాటు విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తు.. రేపు విద్యుత్ సౌధ తో పాటు పౌర సరఫరా కార్యాలయాల ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ ఆందోలన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య లో హాజరు కావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీసులు అరెస్టులు చేస్తే.. పోలిసు స్టేషన్ లల్లోనే ఉద్యమం కొనసాగించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి గింజను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనలు చేస్తామని ప్రకటించారు.