24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలి… లేకపోతే టీఆర్ఎస్ నేతల్ని తరిమికొడతాం: రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో ధాన్యం పోరు పతాక స్థాయికి చేరింది. ఏకంగా సీఎం కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేశారు. ప్రజాప్రతినిధులంతా దీాక్షలో పాల్గొన్నారు. 24 గంటల్లో కేంద్రం ధాన్యం కొనుగోలుపై తేల్చాలని డెడ్ లైన్ విధించించారు. మరోవైపు హైదరాబాద్ లో బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేరించాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ట్విట్టర్ వేదికగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేసీఆర్ కాలక్షేపం కబుర్లు కట్టిపెట్టి ధాన్యం కొనుగోళ్ల పై ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.. 24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలి…. లేనిపక్షంలో కాంగ్రెస్ సారథ్యంలో రైతులను కూడగట్టి టీఆర్ఎస్ నేతలను గ్రామాలకు రాకుండా తరిమికొడతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు కేసీఆర్ ఢిల్లీ దీక్షపై సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. కల్లాల్లో రైతులు ఎండకు ఎండి,గుండె పగిలి చస్తుంటే… కేసీఆర్ ఢిల్లీలో కూలర్లు,ఏసీల మధ్య నిరసన పేరుతో సేద తీరుతున్నాడని… డ్రామాలు కట్టి పెట్టి గ్రామాలకు రావాలని…  ధాన్యం సేకరణ మొదలు పెట్టకుంటే ఢిల్లీ నుంచి శంకరగిరిమాన్యాలకే వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version