మహిళలకు బిగ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే

-

బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. భూమిపైనే అత్యంత విలువైన వస్తువు… ఏదైనా ఉందంటే అది కేవలం బంగారం మాత్రమే. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. కరోనా ఎంటర్ తర్వాత బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి.

ఇది ఇలా ఉండగా తాజాగా కూడా బంగారం ధరలు కాస్త పెరిగి పోయాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పెరిగి రూ. 53,450 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి… రూ. 49,000 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 600 పెరిగి రూ. 72,900 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version