ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చెత్తరికార్డు.. 67 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు

-

దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలు సాధించి దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమైంది.ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయి కేవలం 22 స్థానాలతో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది.

ఇకపోతే గతంలో ఢిల్లీ పీఠాన్ని పలుమార్లు దక్కించుకున్న జాతీయ కాంగ్రెస్ చతికిల పడిపోయింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి సున్నా స్థానాలు వచ్చాయి. 70 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగగా 67 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయినట్లు తెలుస్తోంది. కేవలం 3 స్థానాల్లోనే డిపాజిట్లు వచ్చాయని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా, దేశంలో కాంగ్రెస్ నానాటికీ దిగజారిపోవడంపై సీనియర్ లీడర్లు, జాతీయ నేతలు, పొలిటికల్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news