హయత్ నగర్‌లోని కోహెడలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. అక్కడ కొందరి ప్లాట్లను కబ్జా చేసి ఓ రియల్టర్ భారీ ఫాంహౌస్‌ను నిర్మించినట్లు హైడ్రాకు ఫిర్యాదు అందింది.
కోహెడ గ్రామంలో సర్వే నెంబర్ 951,952లో 7.28 గుంటల భూమిని రియల్టర్ సంరెడ్డి బాల్ రెడ్డి అనే వ్యక్తి కబ్జాకు పాల్పడ్డాడు. దీంతో 170 మంది బాధిత ప్లాట్స్ ఓనర్లు హైడ్రాను ఆశ్రయించారు. దీంతో హైడ్రా అధికారులు సోమవారం ఉదయం కోహెడకు చేరుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రియల్టర్ అక్రమంగా నిర్మించిన ఫాంహౌస్‌ను కూల్చివేస్తున్నారు. హైడ్రా అధికారుల నిర్ణయంతో ల్యాండ్స్ పొగొట్టుకున్న బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్లాట్స్ తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు.