ర‌ఘురామ‌పై రాజ‌ద్రోహం కేసు కొన‌సాగింపు?.. వైసీపీకి క‌లిసొచ్చిన తీర్పు!

-

వైసీపీ ఎంపీ ర‌ఘురామ అరెస్టుపై ఎట్ట‌కేల‌కు వైసీపీకే అనుకూలంగా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఆయ‌న కేసులో సుప్రీం కీల‌క తీర్పు ఇచ్చింది. ఆయ‌నుకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. కొన్ని ష‌ర‌తుల‌ను విధించింది. ఆయ‌న‌పై రాజ‌ద్రోహం కేసు కొన‌సాగించ‌వ‌చ్చ‌ని, ఆ కేసుకు ఎంపీ స‌హ‌క‌రించాల‌ని చెప్పింది. అలాగే మీడియాతో, సోష‌ల్ మీడియాలో మాట్లాడొద్ద‌ని చెప్పిన తీర్పు వైసీపీకి ఇప్పుడు అనుకూలంగా మారింది.

ఎంపీపై విధించిన ష‌ర‌తుల ఆధారంగా సీఐడీ కేసులో వేగం పెంచింది. అలాగే ఆయ‌న‌పై మ‌రికొద్ది కాలం రాజ‌ద్రోహం కేసును కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న సుప్రీంకోర్టులో లేవ‌నెత్తిన అంశాల‌ను సీఐడీ ఆధారంగా చేసుకోనుంది.

ఆయ‌న ఎలాగూ సోష‌ల్‌మీడియాలో, మీడియాతో మాట్లాడ‌లేరు కాబ‌ట్టి వైసీపీకి టెన్ష‌న్ లేన‌ట్టే. ఇక ర‌గురామ విమ‌ర్శ‌లు ఎక్క‌డా వినిపించ‌వు. కాబ‌ట్టి ఇదే స‌మ‌యంలో ఆయ‌న‌పై మ‌రిన్ని ఆధారాల‌ను సీఐడీ సేక‌రించి కేసుకు మ‌రింత బ‌లం చేకూర్చాల‌ని చూస్తోంది. ఇవ‌న్నీ చూస్తుంటే వైసీపీకి పెద్ద త‌ల‌నొప్పి త‌గ్గింద‌నే చెప్పాలి. మొత్తానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి పెద్ద ఇబ్బంది త‌ప్పింద‌ని అంతా అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version