తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటి కస్తూరి అరెస్టుకు రంగం సిద్ధం?

-

తమిళ, తెలుగు ఇండస్ట్రీలో సుపరిచితమైన నటి కస్తూరి తెలుగు ప్రజలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. బీజేపీ మహిళా నాయకురాలిగా ఉన్న ఆమె ఓ సభలో మాట్లాడుతూ తెలుగు ప్రజలను కించపరిచేలా కామెంట్స్ చేశారు. దీంతో ఆమె మీద పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుగా క్షమాపణలు సైతం చెప్పారు.తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, మీడియా వక్రీకరించిందని చెప్పే ప్రయత్నం చేశారు.

 

‘మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు.నా వ్యాఖ్యలు మీ మనసును బాధపెట్టి ఉంటే క్షమించండి.నేను మాట్లాడిన మాటలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను’ అని నటి కస్తూరి ఎక్స్ వేదికగా స్పందించారు. అయినప్పటికీ కస్తూరీ వ్యాఖ్యలపై పలు తెలుగు, తమిళ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో చెన్నై ఎగ్మోర్ పీఎస్‌లో 4 సెక్షన్ల కింద కస్తూరి మీద కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version