Ap High Court: హీరో అల్లు అర్జున్ పై కేసుపై బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హీరో అల్లు అర్జున్ పై నంద్యాలలో నమోదైన కేసుపై నేడు ఏ.పి. హైకోర్టులో తీర్పు రానుంది. ఏపీ ఎన్నికల ప్రచారం చివరిరోజు మే 11 న వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వచ్చి మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్. దీంతో అల్లు అర్జున్ ను చూడటానికి భారీగా తరలివచ్చారు అభిమానులు.
అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రరావు. దీంతో అల్లు అర్జున్ , నాటి ఎమ్మెల్యే శిల్పారవిపై టూ టౌన్ పి. ఎస్. లో కేసు నమోదు అయింది. నంద్యాల పర్యటన వ్యక్తిగతం అన్న అల్లు అర్జున్….తమపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరునంలోనే… నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది ఏపీ హై కోర్టు. ఇక ఇవాళ అల్లు అర్జున్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ పై నంద్యాలలో నమోదైన కేసుపై నేడు ఏ.పి. హైకోర్టులో తీర్పు రానుంది.