క‌ళ్యాణ్‌రామ్ సినిమా ఆ హిట్ సినిమాకు కాపీనా..!

-

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్‌కు ఈ యేడాది 118 సినిమా అతడికి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశమిచ్చింది. వ‌రుస ప్లాపుల్లో ఉన్న క‌ళ్యాణ్ ఈ సినిమాతో కాస్త కోలుకున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం డైరెక్టర్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడ‌వురా అనే సినిమా చేస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా కాపీ మూవీ అని ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం న‌డుస్తోంది.


ఇది గుజరాతీలో విజయవంతమైన ‘ఆక్సిజన్’ అనే సినిమా నుండి ఇన్ స్పైర్ అయ్యి తీస్తున్న సినిమా అట‌. కాకపోతే మూల కథ మాత్రమే తీసుకుని దానిని మ‌న‌కు అనుగుణంగా మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు ఎన్ని మార్పులు చేసినా మూల‌క‌థ గుజ‌రాతీది అయితే దానిని కాపీయే అంటార‌న‌డంలో సందేహం లేదు. ఈ సినిమా నిర్మాత‌లు గుజ‌రాతీ సినిమా మూల‌కథ తీసుకున్నా.. రైట్స్ తీసుకుంటే ఇబ్బంది ఉండ‌దు.

రైట్స్ తీసుకోకుండా మూల‌క‌థ వాడుకుంటే రిలీజ్‌కు ముందు చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ సినిమాతో ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ నిర్మాణంలోకి అడుగు పెడుతోంది. కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ నటిస్తుంది. కళ్యాణ్ ఫ్యామిలి సినిమాలు చాలా తక్కువ చేశాడు కాబట్టి ఈసినిమాతో హిట్ ఎట్టిపరిస్థితుల్లో అందుకోవాలని చూస్తున్నాడు.

ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ట్విస్ట్ ఏంటంటే సంక్రాంతికి బ‌న్నీ, మ‌హేష్ సినిమాలు ఉన్నా కూడా ఈ సినిమా కంటెంట్ మీద ఉన్న న‌మ్మ‌కంతోనే ధైర్యంగా సంక్రాంతి బ‌రిలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news