బిగ్ బ్రేకింగ్; ఇండియాలో ఒక్క రోజులోనే 4 వేల కేసులు…!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాసేపటి క్రితం కేంద్రం హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3900 కరోన కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులోనే ఇన్ని కేసులు నమోదు అవ్వడం రికార్డ్.

ఇప్పటి వరకు 2 వేలు, 2500 మధ్యలోనే కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 11 వేల మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కేసుల సంఖ్య 46 వేలు దాటింది. మరణాలు కూడా 1500 దాటాయి. 24 గంటల్లో దాదాపు 200 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. యాక్టివ్ కేసులు 32 వేలు ఉన్నాయి. కేవలం 20 జిల్లాల్లోనే ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముంబై, కర్నూలు, తానే, సూరత్, ఢిల్లీ నగరాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అహ్మదాబాద్ లో కూడా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్ లో కరోనా తగ్గుముఖం పట్టింది. దీనితో లాక్ డౌన్ ని కేంద్రం కఠినంగా అమలు చెయ్యాలని భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version