ఏపీలో రికార్డ్ స్థాయిలో మరోసారి కరోనా కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవ౦ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో 82 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు ఏపీ వ్యాప్తంగా 1259 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 970 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూలు గుంటూరు జిల్లాలోనే ఒక్క రోజులోనే 57 కేసులు నమోదు అయ్యాయి.

258 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. 24 గంటల్లో 5, 783 శాంపిల్స్ ని పరీక్షించారు. 3 రోజులుగా ఏపీలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. 31 మంది ఇప్పటి వరకు మరణించారు. గత నాలుగు రోజుల నుంచి ఇదే స్థాయిలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. కర్నూలు జిల్లాలో 40 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో 17 కేసులు, కృష్ణా లో 13 కేసులు నమోదు అయ్యాయి.

అనంతపురం చిత్తూరు లో ఒక్కో కేసు నమోదు అయింది. నెల్లూరు జిల్లాలో 3 కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా కర్నూలు గుంటూరు జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 332 కేసులు నమోదు కాగా కృష్ణా లో 223 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు లో 254 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 8౦ కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version