చైనాను మాత్రం వదిలిపెట్టను; ట్రంప్ వ్యాఖ్యలు…!

-

అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఏమో గాని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం చైనాను బాగా టార్గెట్ చేసారు. కరోనాను ముందు నుంచి చైనా తయారు చేసింది అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నా ట్రంప్ ఏకంగా ఆ దేశంలో విచారణ చెయ్యాలని అధికారులను ఆదేశించారు. చైనా పాత్రపై తీవ్ర స్థాయిలో అమెరికా దర్యాప్తు చేస్తుంది అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా పిండంగా ఉన్నప్పుడే చంపలేదు అని ఆయన పేర్కొన్నారు.

దీనివల్ల అమెరికా సహా యావత్తు ప్రపంచం అతలాకుతలమైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజల ఆరోగ్యం సహా, ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమైపోయాయన్న ట్రంప్… చైనాను బాధ్యులుగా చేయడానికి తమ వద్ద చాలా మార్గాలు ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. డ్రాగన్‌ దేశం తీరుతో తాము ఏమాత్రం సంతృప్తిగా లేమని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేసారు. వైరస్‌ వెలుగులోకి వచ్చిన తొలినాటి నుంచి కూడా,

చైనా వాస్తవాల్ని తొక్కిపెట్టేందుకే ప్రయత్నించిందని ట్రంప్ ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు. ఈ విషయంలో జర్మనీ అడుగుతున్న 130 బిలియన్‌ యూరోల పరిహారం కంటే చైనా నుంచి చాలా ఎక్కువే వసూలు చేయాలని తాము యోచిస్తున్నామని ట్రంప్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా కారణంగా అమెరికాలో 60 వేల మంది మరణించిన సంగతి తెలిసిందే. అక్కడ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version