ఏపీ ప్రజలకు బాబు బహిరంగ లేఖ… ఇది కూడా ఆ కోణంలోనేనా!?

-

రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ‘‘పెనం మీదనుంచి పొయ్యిలోకి’’ నెట్టిందని అని మొదలుపెట్టినా ఆయన… రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపవుతున్నాయని, దానికి వైకాపా నాయకుల నాయకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమే కారణం అని ఆరోపించారు. వలసకార్మికుల గురించి, రైతుల గురించి, వైసీపీ రంగుల గురించి, టీడీపీ బాధ్యతాయుతమైన పార్టీ అంటూ… ఇలా దాదాపు ఒక బహిరంగ సభలో పరిపూర్ణమైన రాజకీయ ప్రసంగం అంతా కలిపి… ఒక లేఖగా ప్రజలకు రాశారు బాబు! చిత్రమేమిటంటే… ఈ లేఖ చూస్తున్నంత సేపూ… రాజకీయ విమర్శలు, సెల్ఫ్ డబ్బా తప్ప… ఆ లేఖలో ప్రజలకు ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా లేదని కామెంట్లు వినిపించడం కొసమెరుపు!

వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి వెళ్లడం మనసు కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు… దానికి ప్రభుత్వం ఏమిచేయాలో, పోనీ బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఆయన ఏమి చేస్తారో చెప్పరు. భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తులవారు, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారన్నారు… అది అందరికీ తెలిసిన విషయమే కదా! అది ఏపీలో మాత్రమేనా… దేశమంతా అదే పరిస్థితి కదా! రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని అంటున్న చంద్రబాబు… పొరుగు రాష్ట్రం కొన్న ధాన్యంలో పదో వంతు కూడా మన రాష్ట్రంలో కొనలేదని విమర్శించారు. ఈ విషయంలో ఏపీలో ధాన్యం కొనుగోలు ఏస్థాయిలో జరుగుతుందో బాబుకి తెలియకపోవడం! పంట ఉత్పత్తులు ముందే సేకరిస్తే ఇప్పుడీ అకాల వర్షాలు, తుపాన్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లేది కాదని చెబుతున్న బాబు… కరోనా మాత్రం వస్తాదని ఎవరైనా ముందుగా ఊహిస్తారా… అన్న విషయం మరిచిపోవడం!

ఏది ఏమైనా… నిత్యం పత్రికల్లో ఏదోలా ఒక ఫోటో వేయించుకోవాలనే తపన, టీవీల్లో ఒక అరగంట కనిపించాలనే ఆతృత తప్ప… ఈ లేఖలో ప్రజలకు పనికొచ్చేది ఏముందో బాబుకే తెలియాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version