షాకింగ్ న్యూస్ : ఒకే ఆసుపత్రిలో 33 మంది సిబ్బందికి కరోనా…

-

దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు ఉదృతం అవుతున్నాయి. రోజురోజుకు దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో మరోసారి దేశం మరో ఉప్పెనను చూాడాల్సి వస్తుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే కేసుల పెరుగుదల థర్డ్ వేవ్ కు సంకేతమని పలువురు నిపుణులు అంటున్నారు. గతంలో రోజూవారీ కేసులు 10 వేల లోపే ఉంటే ప్రస్తుతం కేసుల సంఖ్య 30 వేలను దాటుతున్నాయి.

ఇదిలా ఉంటే పలు ఆస్పత్రుల్లో సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్లోని రాజధాని లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 33 మంది ఆస్పత్రి సిబ్బందికి కరోనా సోకింది. ఇందులో 32 మంది ఆసుపత్రి సిబ్బంది కాగా.. ఒక్కరు ఎమర్జెన్సీ డాక్టర్ ఉన్నారు. అయితే వీరందరికీ కూడా ఏ లక్షణాలు లేవని తెలుస్తోంది. అయితే మిగతా ఆస్పత్రి స్టాఫ్ కు కూడా పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version