మాట తప్పడం..మడమ తిప్పడం.. సిగ్గు అనిపించడం లేదా ? జగన్ పై చంద్రబాబు ఫైర్

-

వైసీపీకి ప్రజలు నమ్మకంతో ఓటేస్తే.. జగన్ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశారని ఫైర్‌ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో నాకేం సంబంధం లేదని ఎవరైనా భావిస్తే.. రాష్ట్ర భవిష్యత్తుకు ఇబ్బందేని.. జగన్ పాలన ప్రజా వేదిక విధ్వంసంతోనే మొదలైందని ఆగ్రహించారు. ప్రజా వేదిక కూల్చివేతతోనే జగన్ తన స్వభావాన్ని బయట పెట్టుకున్నారని.. ప్రజా వేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి.. ఆ ప్రజా వేదికనే కూల్చేయమని చెప్పిన ఘనుడు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాట తప్పడం .. మడమ తిప్పడం .. సిగ్గు అనిపించడం లేదా అని జగన్‌ ను ప్రశ్నించారు. ప్రజా వేదికను విధ్వంసం చేసిన జగన్.. ఆ డెబ్రిస్సును తీయలేకపోయారని.. అమరావతి రాజధానికి అన్ని కులాలు, మతాల వాళ్లు భూములిచ్చిన రైతులని ప్రభుత్వం ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కట్టిన భవనాలను నిరుపయోగంగా వదిలేశారని.. సైబరాబాదుని గ్రాఫిక్స్ అని.. విధ్వంసం చేసుంటే ఇవాళ హైదరాబాద్ ఎక్కడుండేది..? అని ప్రశ్నించారు.

అమరావతిని విధ్వంసం చేయడం ద్వారా రూ. 2 లక్షల కోట్ల సంపదను నాశనం చేశారని.. పోలవరంపై ఎన్నో ఆరోపణలు చేసిన వైసీపీ.. ఇప్పుడు రూ. 10 వేల కోట్ల మేర అదనంగా ఖర్చయ్యేలా ఉందన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇస్తామన్న పరిహరం ఏమైంది..? అని.. 2021 నాటికి పోలవరం పూర్తవుతుందన్న జగన్.. ఇప్పుడెళ్లి డీపీఆర్ ఆమోదించమని అడుగుతున్నారన్నారు. పట్టిసీమ నీళ్లే గతైందని.. పరిశ్రమలు తేవడం చాలా కష్టమని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version