బ్రిటన్ లో కరోనా విజృంభణ.. లక్ష దాటిన మరణాలు..

-

కరోనా మహమ్మారి సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ప్రపంచాన్నే గడగడలాడించి ఇంట్లో కూర్చోబెట్టిన కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కరోనా సోకి చనిపోయే వారు మాత్రం ఆగడం లేదు. తాజాగా బ్రిటన్ లో కరోనా మరణాలు లక్ష దాటాయి. ఇప్పటి వరకు కరోనా కారణంగా బ్రిటన్ లో 1.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వ్యాప్తి తగ్గుతుందని అనుకునేలోపే కరోనా స్ట్రెయిన్ అని రూపాన్ని మార్చుకుని మరీ భయపెడుతుంది.

corona-virus

మొత్తం కేసుల సంఖ్య 36.89లక్షలుగా ఉందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఐతే ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుందట. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10.08కోట్లకి చేరింది. మనదేశంలో ఆల్రెడీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్ ఇస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మరింత మందికి కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version