కరోనా చావు కుక్క చావు కంటే భయంకరంగా ఉంటుంది అని చాలా మంది అంటూ ఉంటారు. కరోనా తో చావడం కంటే ఏదైనా చేసుకుని చచ్చిపోయినా బాగుంటుంది అని కరోనా బాధితులు కూడా వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. అందరూ ఉన్నా సరే అనాధ మాదిరిగా చనిపోయే పరిస్థితి ఉంటుంది. కనీసం నా అన్న వాళ్ళు ఎవరూ కూడా మనని చివరి చూపు చూడటానికి కూడా వచ్చే పరిస్థితి ఉండదు.
ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. గుంటూరు : కరోనా మహమ్మారి అనుబంధాలను దూరం చేసింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మరణించారు. ఆయనను చూడటానికి ఎవరూ రాలేదు.
దీనికి కారణం ఆయనకు కరోనా వైరస్ ఉందని తెలియడమే. ఆసుపత్రిలో ఉన్న వివరాల ఆధారంగా అధికారులు నరసరావుపేటలోని మృతుడి బంధువులకు సమాచారం అందించారు. వారు అందరూ క్వారంటైన్ లో ఉన్నారు. అయినా స్నేహితులు కూడా ఎవరూ రాలేదు. దీనితో ఉన్నతాధికారులను సంప్రదించి వారు ఇచ్చిన సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని శుక్రవారం స్థానిక స్తంభాలగర్వులో శ్మశానవాటిలో అంత్యక్రియలు పూర్తి చేసారు.