శానిటైజర్ తో చేతులు కడుక్కుంటే కరోనా చచ్చిపోతుంది అనేది ఇప్పుడు వైద్యులు చెప్తున్న మాట. దాని బారిన పడకుండా ఉండాలి అంటే కచ్చితంగా శానిటైజర్ లేదా సబ్బుతో చేతులు ఎప్పుడు కడుక్కోవాలి. మరి దానిలో ఆల్కాహాల్ ఉంటుంది. చిన్న తేడా వచ్చినా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది దానిని వాడే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే మన దేశంలో ఆల్కాహాల్ లేకుండా తయారు చేసారు. దాని కంటే ఇదే మెరుగ్గా పని చేస్తుంది. పుణెకి చెందిన గ్రీన్ పిరమిడ్ బయోటెక్ సంస్థ పూర్తి ప్రకృతి సిద్ధమైన శానిటైజర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని రూపకల్పనకు పూర్తిగా జీవ దాతువులనే క్రియాశీల ఔషధ మూలకాలు(ఏపీఐ)గా వాడారు. సుదీర్ఘకాలం బ్యాక్టీరియా, వైరస్‌తో పోరాడుతుందని ఏ విధంగా కూడా బ్యాక్టీరియా బ్రతికే అవకాశం లేదని స్పష్టం చేసారు.
రోగకారక బ్యాక్టీరియా, శిలీంద్రాలు, పసుపుపచ్చ మరకలపై విజయవంతంగా ప్రయోగించి చూడగా అది సమర్ధవంతంగా పని చేసిందని గుర్తించారు. ఫార్ములేషన్లు చేతులు, ఉపరితలాలను సమర్థవంతంగా శుభ్రం చేస్తాయని పేర్కొన్నారు. అదే విధంగా దీనితో గాయాలను కూడా శుభ్రం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. చర్మం కూడా పొడిబారకు౦డా ఉపయోగపడుతుంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆర్ధిక వనరులను సమకూర్చింది.