మొన్నటివరకు కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మళ్ళీ రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదు అక్కడి ప్రజలు భయాందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధిస్తు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే .
అయితే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విధించిన జరిమానా ల ప్రకారం… కరోనా నిబంధనల ఉల్లంఘన కింద 26 కోట్ల జరిమానా వసూలు కావడం సంచలనం గా మారిపోయింది. జూన్ 15వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు కేవలం జరిమానాల రూపంలోనే 26 కోట్లు వసూలు చేశారు ఢిల్లీ పోలీసులు… దీన్ని బట్టి ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్నది అర్ధమవుతుంది. మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా, పబ్లిక్ ప్లేస్ లో ఉమ్మి వేయడం లాంటి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించగా జరిమానాలు 26 కోట్లకు చేరుకుంది.