తెలంగాణలో భారీగా త‌గ్గిన క‌రోనా.. నేడు కొత్త‌గా 256 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ రోజు విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవ‌లం 256 కరోనా పాజిటివ్ కేసులు మాత్ర‌మే న‌మోదు అయ్యాయి. కాగ శ‌నివారం రాష్ట్ర వ్యాప్తంగా 401 క‌రోనా కేసులు వెలుగు చూశాయి. అంటే ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే దాదాపు 150 క‌రోనా కేసులు త‌గ్గాయి. కాగ నేటి వ‌రకు తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. 7,86,678 కు చేరింది.

కాగ ఈ రోజ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు వెలుగు చూడ‌టం లేదు. కాగ నేడు రాష్ట్రంలో 767 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం కేవ‌లం 5,135 క‌రోనా యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. కాగ రాష్ట్రంలో ప్ర‌స్తుత రిక‌వరీ రేటు.. 98.82 శాతం గా ఉంది. కాగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 25,341 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version