దేశంలో కరోనా కల్లోలం… 24 గంటల్లో 1,17,100 కేసులు నమోదు..పాజిటివిటీ రేటు 7.74గా నమోదు.

-

దేశంలో కరోనా కల్లోలం కలిగిస్తోంది. థర్డ్ వేవ్ ముంచుకోస్తుంది. ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో మొత్తం 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. చాలా రోజుల తరువాత దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు రావడం ఇదే మొదటిసారి. వారం క్రితం రోజుకు కేవలం 10 వేల లోపలే ఉన్న కరోనా కేసుల.. వారం వ్యవధిలో లక్షను దాటాయంటే పరిస్థితి తీవ్రత ఏవిధంగా ఉండో అర్థమవుతోంది. మరణాల సంఖ్య కూడా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 302 మరణాలు చోటు చేసుకున్నాయి. 30836 మంది రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 3,71,363 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 3,43,71,845 గా ఉండగా.. ఇప్పటి వరకు కరోనా బారిన పడి  4,83,178 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 7.74 శాతంగా ఉంది. 

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశంలో అక్కడే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 36265 కేసులు నమోదవ్వడం కలవరానికి గురిచేస్తోంది. కేంద్రం కూడా కరోనా కేసుల పెరుగుదలపై అప్రమత్తం అయింది. ఇప్పటికే  కేంద్రం రాష్ట్రాలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని లేఖలు రాసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version